ఎవరికి చెప్పాలి నేను
341
పల్లవి: ఎవరికి చెప్పాలి నేను ఏమని చెప్పాలి
ఎవరిని అడగాలి నేను ఏమని అడగాలి(2)
నా వారికి నేను చెప్పాను-లేదు కాదని అన్నారు
పొరుగు వారికి నేను అడిగాను-మా వల్ల కాదని అన్నారు
యేసయ్యా నీకే చెప్పెదను నా బాధలు
యేసయ్యా-నీకే అడిగెదను-నా అవసరములు
1 నేను అడిగాక ముందే నా అకరలేరిగినా దేవుడా
నేను తలచక ముందే నా తలంపు లేరిగిన దేవుడా(2)
అడుగు వాటి కైనాను యెచ్చించు వాటి కైనాను
అధికముగా అనుగ్రహించే దేవుడా నీవే యేసయ్యా(2)
అందుకు నా ఆలాపన అందుకో నా ఆరాధన “ఎవరికి”
2 నేను పడియున్న వేళలలో లేవనెత్తిన దేవుడా నీవే (2)
నేను కృంగిన వేళలలో ఓదార్చిన దేవుడా నీవే(2)
ఆదారించే దేవుడా ప్రేమ చూపే నాధుడా(2)
నాకొండ నాకోట నా దుర్గము నీవే యేసయ్యా(2)
అందుకు నా ఆలాపన అందుకో నా ఆరాధన “ఎవరికి”
3 నేను ఒంటరినైనప్పుడు నాకు తోడుగా నీవే నిలిచావు
నేను భయపడినప్పుడు-నాకు ధైర్యముగా నీవే నిలిచావు (2)
బల్లమైన దేవుడా పరాక్రమ శూరుడా(2)
విడువక మరువక జయమిచ్చిన దేవుడా నీవే
అందుకు నా ఆలాపన అందుకో నా ఆరాధన “ఎవరికి”
 
రచన మరియు గానం: పాస్టర్‌. జయపాల్‌ గారు.