ప్రభుని చూడాలనీ ప్రియుని వేడలనీ
340
పల్లవి: ప్రభుని చూడానీ-ప్రియుని వేడలనీ
ప్రభుతో ఉండాలనీ-కలిసి ఉండాలనీ
ప్రియుని చేరలనీ-పరవసించేనులే (2)
1 నీ మాటతో నా జీవితం- మార్చుకొంటిని
నా పాటతో నీ నామమున్‌ మహిమ పరుతును (2)
నీవు లేక నేను ఎండి మోడునైతిని (2)
నీ మాటలే మధురమై-మనుస్సు నిలిపేనే “ప్రభు”
2 కంటికి రెప్పలా కాచుచుంటివి
నీ కంటికి ఇంపుగా మార్చుకో ప్రభు (2)
నీ కిష్టమైన పాత్రగా నన్ను మార్చుకో (2)
నా కష్టములలో నన్ను నీవు ఓదార్చుమా “ప్రభు”
ఎండకు వాడిన చిన్ని పుష్పమా
బాధలో నలిగిన లేత హృదయమా (2)
నీ దేవుడే తోడుగా నిన్ను నడుపును (2)
తన చేతులతో నిన్ను లాలించును ప్రభు