తెలిసుకో మానవా
339
పల్లవి: తెలుసుకో మానవా -నీ జీవిత గమ్యమేదోఒక్క సారి తిరిగి చూడు - సమస్తము వ్యర్దమే
1 ఈలోక బాటలో -విసిగి వేసారావా
అలసి సొలసి పోయి నీవు - దిక్కులేక ఉన్నావా “తెలుసుకో”
2 నీ అందం వ్యర్దము - సౌందర్యము వ్యర్దము
నశియించే దేహం కోసం-ఎందుకో ఈ మురిసిపాటు “తెలుసుకో”
3 విశ్యాసయాత్రలో - ముందుకు కొనసాగుమా
యేసు నీతోడుంటాడు - యేసు నిన్ను ప్రేమిస్తాడు “తెలుసుకో”