యేసయ్యా నీవే
338
పల్లవి: యేసయ్యా నీవే పూజ్యనీయుడవువేల్పులో నీకు సాటి ఎవ్వరు లేరు నీవే యోగ్యుడవు
హ..హల్లెలూయా..ఆ..హల్లెలూయా
1 వేవేల దూతలతో పరిశుద్దుడవని-పొగడబడుచున్న దేవుడా (2)
నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు-నీవే యోగ్యుడవు “హ..హల్లెలూయా”
2 సర్వలోకములలో సద్బోదకుడా-సకలచర సృష్టికర్తవు
స్తుతిగానము నేను చెల్లించెదనయ్యా-నీవే నా దేవుడవు“హ..హల్లెలూయా”
3 ఆశ్చర్యకరుడా-ఆలోచన కర్త-బలవంతుడైన దేవుడా
నిత్యుడగు తండ్రి షాలేము రాజా-నీవే పూజ్యుడవు “హ..హల్లెలూయా”