యెహోవ రాఫా స్వస్థ పరచిన దేవా
326
పల్లవి: యెహోవ రాఫా స్వస్థ పరిచిన దేవామాట ఇచ్చి మాట తప్పని ప్రభువా (2)
నీ కరుణకు కరువే లేదని- నే సాటి చెబుతున్నా..
నీ ప్రేమకు కొరుతే లేదని-నే సాటి చెబుతున్నా.. (2)
నీదు ఎడబాయని నీ ప్రేమ-నన్ను మరవనీ నీ ప్రేమ (2)
1 పాపియాని దోషియాని-నన్ను విడువకా..
నీ కరుణతో కదిలావు (2)
నీ గాయాల చేతులతో తాకి-స్వస్థపరిచిన దేవా (2)
మరువ గలనా నీ-ప్రేమ..మరుపు రానిది నీ ప్రేమ.. (2)
2 పర్వతముల్ మెట్టలునూ-తత్తరిల్లిననూ
నీ కృప నన్ను విడువదుగా (2)
నీ నిత్య నిబంధన ప్రేమ ఇది-శాశ్వతమైన ప్రేమ ఇది (2)
ఊహకందని ప్రేమ ఇది-మరువ జాలనీ ప్రేమ ఇది (2)