నా కన్నీరు నాట్యమాయెను
325
పల్లవి: నా కన్నీరు నాట్యమాయెనునా దుఃఖమంతా సంతోషమాయెను
యేసులో ఆనందమే చింతయే లేదు
నిత్యము సంతోషమే దుఃఖమే లేదు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ(2)
1 కన్నీటి కెరటాలెన్నో నన్నావరించినా
కారుమేఘాల వలె కష్టాలె వచ్చిన(2)
నన్ను కాపాడువాడు నా యేసు రక్షకుడు
కంటి పాపవోలె కాచును ఎల్లప్పుడు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ(2)
2 ఈ లోక నటన అంతా మాయమవ్వునులే
ఈ లోక సౌఖ్యాలన్ని క్షణికాలే నేస్తమా
పరలోక స్వాస్థమంతా మన కొరకే దాచెను
నిలువరమగు పట్టణమే త్వరలోన చేరెదము
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ(2)