స్తుతియింతును ఆరాధింతును
324
పల్లవి: స్తుతియింతును ఆరాధింతును
ఘనపరుతును నిన్నె మరువాను(2)
నీవు చేసిన మేల్లను తలసి-నీవు చూపిన కృపాలను తలసి(2)
నీ మేలులు తలసి తలసి-నిన్ను నేను ఆరాధిస్తా
నీ మేలులు తలసి తలసి-నిన్ను నేను కొనియాడేద–నా యేసయ్యా“స్తుతి”
1 హృదయమంత వేదనతో నిండినప్పుడు
సంతోషముతో నాకు నింపినప్పుడు
బతుకంత బాదతో ఉండినప్పుడు
ఆధారణతో నాకు నింపినందుకు
బలహీనమై నేను పడినప్పుడు
నీ బలముతో నాకు నింపినందుకు
నిశ్చయుడనై నేను పడినప్పుడు
నీ సహాయముతో నాకు నిలిపినందుకు“నీ మేలులు”
2 రోగముతో నేను కృంగినప్పుడు-స్వస్థతను నాకు ఇచ్చినందుకు
కన్నీటిలో నేను నలిగినప్పుడు-ఉత్సహాముతో నాకు నింపినందుకు
ఆకలితో నేను ఉండినప్పుడు-సమృదిగా నాకు ఇచ్చినందుకు
ఒంటరినై నేను వెళ్లునప్పుడు-తోడుగా నీవు నిలిచ్చినందుకు “నీ మేలులు”
3 మరణ ఛాయపై పడినప్పుడు-జీవపు మేలులతో నింపినందుకు
భయముతో నేను వణికినప్పుడు-నీ ధైర్యముతో నాకు నింపినందుకు
వీరోధులు నన్ను చుట్టు ముటినప్పుడు-విజముతో నాకు నిలిపినందుకు
నడవ లేక నేను ఉండినప్పుడు-కృపాతోను నన్ను నీవు నడిపినందుకు “నీ మేలులు”
 
రచన మరియు గానం: పాస్టర్‌. జయ పాల్‌ గారు.