బేదం ఏమి లేదు
316
పల్లవి: బేదం ఏమి లేదు అందరును పాపం చేసి యున్నారు
దేవాది దేవుడు ఇచ్చె ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు(2)
ఏ కులమైనా మతమైనా జాతియైన రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే (2)
1 ఆస్థిపాస్తులు ఎనున్న నిత్యరాజ్యము నీకివ్వవు
విద్య అర్హతలు ఎనున్న సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయె ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయె ఈ కాలము కలవరాన్ని తీర్చాదు
నీ కెవరైనా నీకెంతున్న ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీ కున్నవన్ని సున్న(2) “బేదము లేదు”
2 పుణ్యా కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా
తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్దుడేసు రక్తము కార్చేను కలువరిలో
కోరికోరి నిను పిలిచేను పరమ రాజ్యము నీకవ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృతి ఏదైనా బృతి ఏదైనా
కలువరి నాదుడే రక్షణ మార్గము(2) “బేదం ఏమి లేదు”