ఎన్న సక్యము కాని మిన్న ప్రేమను
315
పల్లవి: ఎన్న సక్యము కాని మిన్న ప్రేమను చూపి
నన్ను కన్నవా యేసయ్యా \rq (2)\rq
చిన్న ప్రాయము నుండి-నన్ను కాపాడి (2)
నీదు కనుసైగలోనే నా దేవా\rq ఎన్న\rq
1 మన్నైన నన్ను నీవు నిండిన పాత్రచేసి
మన్నైన నాకు నీవు-మెండైన వెలుగు నీవు (2)
మింటపైకెత్తినావు-చావైన బ్రతుకైనా ఎన్నో ఇబ్బందులైనా (2)
నిన్నునే విడువ లేను నా దేవ “ఎన్న”
2 మేలైన ఈవులేన్నో నాకై దాసుంచినావు
కీడైన అంట కుండ నను కాపాడినావు (2)
చల్లంగా నన్ను చూసావు “చావైన”
3 ఇంపైన నీ వాక్యాన్ని నాకు బోదించినావు
సొంపైన మోక్ష మార్గం నాకు చూపించినావు (2)
నాకు నీ సాక్షమిచావు “చావైన”