గొర్రెల గొప్ప కాపరీ నా యేసు
314
పల్లవి: గొర్రల గొప్ప కాపరీ నా యేసుమంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు \rq (2)\rq
మంచి కాపరీ-ప్రధాన కాపరీ
గొప్ప కాపరీ-నిత్యకాపరీ (2) “గొర్రె”
1 తప్పిపోయిన నన్ను వెదుకుట కొరకు
దారి తప్పిన నన్ను రక్షించుటకు(2)
కొండలు కోనలు దాటాడు-లోయలు లోతులు వెతికాడు(2) “గొర్రె”
2 జబ్బు పడి నేనున్నప్పుడు-అక్కున చేర్చాడు
మబ్బు పట్టి నేనున్నపుడు-గొర్రెల పాకకు నడిపాడు (2)
పచ్చిక బయల్లో మేపాడు-శాంతి జలములకు నడిపాడు(2) “గొర్రె”