ఎంత కృపామయుడవు యేసయ్యా
313
పల్లవి: ఎంత కృపామయుడవు యేసయ్యా-ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా
నలిగితివి వేసారితివి నాకై ప్రాణము ఇచ్చితివి \rq (2)\rq “ఎంత”
1 బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం
మార్చినావు నన్ను నీ స్వాస్ధ్యముగా
ఇచ్చినావు మెత్తని క్రొత్త జీవితం \rq (2)\rq “ఎంత”
2 కన్న తల్లి తండ్రి నన్ను మరచినన్ను
నాకున్న వారందరు విడిచినన్ను
మరువ లేదు నన్ను విడువ లేదు
ప్రేమతో పిలిచిన నాధుడవు \rq (2)\rq “ఎంత”