యేసయ్యా పొలమురా
300
పల్లవి: యేసయ్యా పొలమురా-ఏపుగా ఉందిరా
వ్యవసాయం చూడరా-ఎంతో బాగుందిరా
1 నారోక్కడు నాటేనురా-నీరోక్కడు పోసేనురా
పైరిచ్చినా వాడురా-పైనున్న వాడురా “యేసయ్యా”
2 ఎలుకలున్నయిరా-ఎన్నుకొరికేనురా
నక్కలున్నయిరా-నక్కి సూస్తాయిరా“యేసయ్యా”
3 వరదలు వచ్చెనురా-బురదలు వచ్చెనురా
బురదలో నా పైరు మునిగి చచ్చెనురా“యేసయ్యా”
4 పనివాళ్ళె లేదురా-పంట పాడయ్యెనురా
పని వాళ్ళును పంపమని-ప్రభు యేసుని అడగరా“యేసయ్యా”