మనస్సున్న మంచి దేవా నీ మనస్సు
292
పల్లవి: మనస్సున్న మంచి దేవా- నీ మనస్సు నాకిచ్చావా
మనస్సు మల్లినమైన నాకై మనిషిగా దిగివచ్చావా \rq (2)\rq
నా మదినే కోవెలగా మలచుకోవయ్యా..
నా హృదిలో రారాజుగా నిలిచి పోవయ్యా.. \rq (2)\rq
1 హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహించుట ఎవరి సాధ్యామయ \rq (2)\rq
మ నసు మర్మమెరిగిన మహా నియుడా
మనసు మార్చగలిగిన నిజ దేవుడా “నా మదినే”
2 చంచల మనసాడించే బ్రతుకు ఆటలు
వంచన చేసి నడుపును తప్పు బాటలు \rq (2)\rq
అంత రగమును మలచె మంచి యేసయ్యా
స్థిర మనస్సుతో నీ దారిలో సాగనిమయ్యా “నా మదినే”
3 నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి
దీన మనస్సుతో నీ కడ శీరము వంచితి \rq (2)\rq
పూర్ణ శాంతిగల వానిగ నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా “నా మదినే”