ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము
288
పల్లవి: ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము
నీ కోసమే నా కోసమే కల్వరి ప్రయాణం
ఈ కల్వరి ప్రయాణం (2)“ఎవరి”
1 ఏ పాపము ఎరుగని నీకు-ఈ పాపం లోకమే సిల్వ వేసిందా
ఏ నేరము తెలియాని నీకు-అన్యాయపు తీర్పునే ఇచ్చిందా \rq (2)\rq
మోయ లేని మ్రానుతో- మోముపైన ఉములతో
నడువ లేని నడకలతో- సుడివడి పోయవా
సోలివాలి పోయవా “ఎవరి”
2 జీవ కీరిటం మాకు ఇచ్చావు- ముళ్ళ కీరిటం నీకు పెట్టాము
జీవ జళ్లములు మాకు ఇచ్చావు- చేదు సిరకను నీకు పోసాము
మా ప్రక్కన ఉండి- మము కాపాడు చుండగా
నీ ప్రక్కన బల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగారు వీరిని క్షమించు
అన్ని వేడుకోనావా “పరమ తండ్రి” “ఎవరి”