ఎవరైన ఉన్నారా- ఎచటైనా ఉన్నారా
287
పల్లవి: ఎవరై ఉన్నారా- ఎచటైనా ఉన్నారాఈలాంటి స్నేహితుడు
నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు
ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు
1 హేతువేమి లేకుండా అర్హతలు చూడకుండా
ప్రేమచూపువారు లేరు లోకమందునా
నేను కోరు కోకుండా నా కోసము
తనకు తాను చేసినాడు సిలువ యాగము
2 అంతస్ధులు లేకుండా అర్హతలు చూడ కుండా
జతను కోరు వారు దొరుకారు ఎంత వెదకినా
మహిమనంత వీడినాడు ఏమి చిత్రము
3 స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా
మేలుచేయువారు ఎవరు విశ్వమందునా
ఉన్నదంతా యిచ్చినాడు ఏమి త్యాగము