మాయ లోకమూ
281
పల్లవి: మాయ లోకమూ మనదికానిలోకమూ..
మనస్సు పెట్టి ఆలోచిస్తే లేనిలోకమూ..
భూమిపైన మనమంతా యాత్రికులం
ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం(2)
1 ఎండ మావిలాంటి ఈ అందమైన బ్రతుకులో
కనిపించే వన్ని వట్టి బ్రమలే కాదా (2)
ఊపిరాగి పోతే ఏముందిలే(2)
ప్రభుని నమ్ముకుంటే జీవముందిలే నిత్య జీవముందిలే(2) “మాయ”
2 కనిపించే మనుషులంత తెరమీద బొమ్మలే
కనిపించే వారుకుడ కాలకాలం ఉండరులే(2)
నీకు ఈ లోకములో ఏముందిలే(2)
తెలుసు కుంటే నీకు మరో లోకముందిలే పరలోకముందిలే “మాయ”