తనకెన్ని దినాలిచ్చెనో
280
పల్లవి: తనకెన్ని దినాలిచ్చెనో దేవుడు..
తెలుసుకోలేడు ఈ మానవుడు (2)
నీ దినములన్ని గ్రంధములో వ్రాసుకున్నాడు
పిండముగా ఉండగా చూసుకున్నాడు
దేవుడు ఉన్నాడు నీ నిర్మాణం వెనుక
రాలి పోతున్నాడు మనిషికి ఇది తెలియక(2)“తన”
1 నీ ఆశలన్నీ నీటిపైన జాడలే
నీ ఊహాలన్నీ గాలిలోన మేడలే(2)
పరువు ప్రతిష్టలు పనికిరావులే
సిరులూ సంపదలూ చెదిరిపోనులే(2)
మృత్యువుతో మట్టిలో కలిసే నీ ఉనికి(2)
ఏ మని చెప్పెదవు నిను కన్న దేవునికి(2) “తన”
2 జీవ శాస్త్ర మెరుగని జీవితమే నీది
జీవగ్రంధమందే వ్రాయబడివుంది(2)
ఈ లోకపు మాయలో పడిపోయావా
పరలోకం వెళ్ళాలని మరచి పోయావా(2)
చనిపోతే నీ కోసం పాతాళం కలవరం(2)
కాల్చాలని నీ ఆత్మను అగ్నిలో నిరంతరం
కాల్చాలని నీ ఆత్మను అగ్నిలో నిరంతరం“తన”