ఏదోలేదని ప్రభుని
279
పల్లవి: ఏదోలేదని ప్రభుని విడువకుఎవరో రారని సువార్త మానకు(2)
దేవుని కోసం పుట్టావు నీవు దేవుని కోసం బ్రతకాలి నీవు
పిల్లా పాప బంధువులంత బొమ్మలేనని
మట్టిలోకి పోయేవారు వట్టివారని(2) “ఏదో”
1 చదువులని పదవులని పరుగులు తీసి
ఉద్యమాలు ఊపిరంటూ ఉరకలు వేసి(2)
లోకమంతా సంపాదించు కున్నా
నీ చావుతో మిగులుతుంది సున్నా(2)
మతం మత్తు ధనం దగా దేవుడే దిక్కు
తెలుసుకొని వదులుకొకు పరలోకపు హక్కు“ఏదో”
2 వట్టినని మట్టినని వల్లించకూ
పురుగునని దూళినని ప్రార్దించకూ(2)
రాజులైన యాజకులే మీరు
మీ కంటే గొప్పవారు ఎవరూలేరు(2)
నిజం తెలిసి గతం మరచి దేవునికై బ్రతుకు
ప్రాణముండగానే నీవు పరలోకం వెతుకు(2)“ఏదో”