మనిషి జన్మ ఎందుకు
277
పల్లవి: మనిషి జన్మ ఎందుకు?
మనిషి బ్రతుకు ఎందుకు?
పుట్టింది దేవుని కోసం బ్రతికేది తనవారి కోసం
వేసింది భక్తిని వేసం-చేసేది అంతా మోసం
ఊపిరిచ్చినా దేవుడు ఊరుకోడు ఊరుకోడు
క్రీస్తు కొరకు బ్రతకకపోతే పరలోకం రానివ్వడు“మనిషి”
1 మళ్ళి జన్మ ఉంటే నీ కడుపున పుడతానని
ఏ జన్మల బంధమో నిన్ను నన్ను కలిపిందని(2)
వట్టి మాటలెన్నో చెప్పి మట్టిలోకి పోతున్నారు
ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు(2)
ఒకసారే పుట్టాలి దేవునికై బ్రతకాలి ఆపైన మరణించాలి పరలోకం చేరాలి
(2) “మనిషి”
2 ప్రకృతిలో ఏదీ కూడా తనకోసం బ్రతుకుటలేదు
సృష్టిలోని మనిషిని చూడు తన కోసమే బ్రతుకునుచూడు(2)
కూటి కొరకు మనిషికున్నవి కోటి విద్యలంటున్నారు
పుట్టుక పరమార్ధ మరచి మృత్యువాత పడుతున్నారు(2)
మనిషికి మృగానికి తేడాయే లేకుందీ
ఇటువంటి వారి కోసమే పాతాళం పొంచియుంది(2) “మనిషి”