తిరిగిరాని లోకనికి
276
పల్లవి: తిరిగిరాని లోకనికి తరలిపోయే ప్రయాణం
ప్రతి మనిషి జీవితంలో తప్పదులే మరణం
నీ జననం నీ మరణం ఒంటరి తనమే
నీ బ్రతుకు ముగిసిపోవుటకు చాలును ఒక్క క్షణమే(2)
1 నీ రాక కొరకు ఎదురుచూచె నీవారు
నీవూ చనిపోతే ఎవరూ నీతో రారు(2)
ఒకే జత బట్టలతో ఒక అత్తరు సీసాతో(2)
సాగనంపు నీవారు వెళ్ళిరండి శ్రీవారని(2)
బ్రతికుంటే కావాలి చస్తే నువు పోవాలి(2)“తిరిగి”
2 నీ రాక కొరకు ఎదురుచూచె నీ దేవుడు
తనువును చాలించి తనయునిగా వస్తావని(2)
తన సుత్తుని పంపించి సువార్తను వినిపించి(2)
తండ్రిగా నీ కోసం తల్లడిల్లి పోతుంటే(2)
ఈ సత్యం గమనించు ఇకనైన కళ్ళు తెరువుము(2) “తిరిగి”