విశ్వాసం ఒక్కటే
275
పల్లవి: విశ్వాసం ఒక్కటే-బాప్తిస్మం ఒక్కటేతండ్రియైన దేవుడొక్కడే
అందరికి పైగా అందరిలో ఉండగా
సంఘాలుగా చీలికెందుకూ..
ఒక్కటిగా ఉండరెందుకు(2) “విశ్వాస”
1 వాక్యంలేని సంఘం జీవంలేని శవం
బాధ్యతలేని కాపరి బ్రతికున్న సోమరి(2)
దైవజనుని ముసుగులో దాగియుంది దయ్యం
నలిగి పోతుంది ఆయే క్రైస్తవం(2) “విశ్వాస”
2 సంఘమంటే దేవుని పిల్లలని ఎరిగి
రాతి కట్టడాలకే విలువనీయకుండా(2)
గుడి దేవుని బడిగా మారిపోవాలి(2)
వడివడిగా సువార్తకు సాగిపోవాలి(2)
మనం సాగిపోవాలి“విశ్వాస”