యేసయ్యా జన్మించినాడు-బెత్లేహేము గ్రామమందు నేడు
274
పల్లవి: యేసయ్యా జన్మించినాడు-బెత్లేహేము గ్రామమందు నేడు
ఇది శుభదినం-పాపికి రక్షణ దినం
మహిమతో నిండిన మహా పర్వ దినము (2)
1 పరలోక సైన్య సముహాము-హృదయములో నిండిన ఆనందము (2)
దూతలంతా కూడుకొని ఆడిరి-స్తోత్రము స్తోత్రమనుచు పాడిరి (2) “యేసయ్యా”
2 గాబ్రియేలు దూత ప్రకటించేను-ఘనమైన యేసు జనన వార్తను (2)
గొల్లలంత ఉల్లసించి ఆడిరి- స్తోత్రము స్తోత్రమనుచు పాడిరి (2) “యేసయ్యా”
3తూర్పున ద్రవ్యతార చెలసింది-జ్ఞానులను బెత్లేహేముకు నడిపింది (2)
సాగిల పడి జ్ఞానులు పూజించిరి-స్తోత్రము స్తోత్రమనుచు పాడిరి “యేసయ్యా”
4 శుభవార్త అనుచున్న లోకమా-పాపుల రక్షకుడు యేసు అని ఎరుగుమా (2)
రక్షణ పొంది ప్రభువుని స్తుతియించుడి-స్తోత్రము స్తోత్రమనుచు పాడుడి (2) “యేసయ్యా”