ఎవరున్నా లేకున్నా
273
పల్లవి: ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలయ్యాఎం ఉన్న లేకున్నా నీ కృపవుంటే చాలయ్యా
నా తోడుగా నా నీడగా నీవుంటే చాలయ్యా
నీ ప్రేమతో నీ జాలితో నడిపించుము యేసయ్యా(2)
నా యేసయ్యా నీ కృప చాలయ్యా(2) “ఎవరున్నా”
1 బలశౌర్యములు నాకిళ్లలో లేక పోయిన్నా
దీన స్థితిలోన పడి నేను కృంగి పోయిన(2)
శోధనలే ఎదురైనా-ఆధారణ లేకున్నా
నీవుంటే చాలయ్యా -నా యేసయ్యా(2) “నా తోడుగా”
2 వెండి బంగారములు నాకు లేక పోయిన్నా
ఆస్థి ఐశ్వర్యములే నాకు కలుగక పోయిన్నా(2)
ధనమే లేకున్నా-బల్లమే లేకున్నా(2)
నీవుంటే చాలయ్యా -నా యేసయ్యా(2) “నా తోడుగా”
3 మేడ మిద్దెలు నాకిళ్ళలో లేక పోయిన్నా
కీర్తి ఘనతలు నాకచ్చాలే కలుగక పోయిన్నా
గుర్తింపే లేకున్నా-మర్ణింపే రాకున్నా(2)
నీవుంటే చాలునయ్యా-నా యేసయ్యా(2)“నా తోడుగా”