గూడులేని గువ్వలా
272
పల్లవి: గూడులేని గువ్వలా దారితప్పితి
గుండె చెదిరిన కోయిలళా మూగబోతిని (2)
నీ గుండేలో దాచ్చుమా-నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా-నా క్షేమము నీవయ్యా..
నా క్షేమమా- నా ప్రాణము నివయ్యా.. “గూడులేని”
1 గువ్వలకు గూడు ఇష్టం-కోయిలకు పాట ఇష్టం
నాకేమో నువ్వు ఇష్టం-నీ సన్నిది ఇష్టం
నువ్వంటే నాకిష్టం యేసయ్యా..
నువ్వు లేకుంటే బ్రతుకే కస్టమయ్యా..(2)
నా ప్రాణమా-నా క్షేమము నీవయ్యా..
నా క్షేమమా-నా ప్రాణము నివయ్యా..“గూడులేని”
2 చేపాలకు నీళ్లు ఇష్టం-పిల్లలకు తల్లి ఇష్టం
నీకేమో చెలిమి ఇష్టం-నా స్నేహాం ఎంతో ఇష్టం
నేనంటే ఎంతో ఇష్టమయ్యా..
మీరు అంటు ఉంటే ఎంతో ఇష్టమయ్యా..(2)
నా ప్రాణమా-నా క్షేమము నీవయ్యా..
నా క్షేమమా-నా ప్రాణము నివయ్యా..“గూడులేని”