నీ ప్రేమకు
268
పల్లవి: నీ ప్రేమకు సాటి లేనేలేదు
ప్రేమా రూపా యేసు రాజా
ఆ..ఆ..ఆ..ఆ..(2)
1 నింగియందునా నేలయందునా
పాతాళందునా ఎందైనా గానీ (2)
నీ కన్నీ అధికులు ఎవరు లేనేలేరు “నీ ప్రేమకు”
2 పాపినైన నాకోరకు పరలోకం విడిచిన దెవరు
నా పాపములకై సిలువలో మరణించిన దెవరు (2)
క్షమియించి రక్షించి నాదు తండ్రి నీవే “నీ ప్రేమకు”
3 ధరలోని ధనధాన్యములు నున్ను విడినా
ఇలలో నా సరిదారం త్రోసివేసినా (2)
ఇహమందు పరమందు నాదు ధనమం నీవే “నీ ప్రేమకు”