నీ కోసం ఆ దేవుడు
267
పల్లవి: నీ కోసం ఆ దేవుడు సృష్టిని చేసాడు చూడు
నీ కోసం ఆ యేసునే బలిగా ఇచ్చాడు చూడు
నువ్వంటే తనకెంతో ఇష్టం నువ్వు బ్రతకాలనే సృష్టిని చేసాడు ఆ దేవుడే
గాడ్‌ లవ్స్‌యు - గాడ్‌ వాంట్స్‌యూ{ “నీ కోసం”
1 పువ్వులోని రంగుచూడు దానిలోని స్మెల్లు చూడు
చేసిందెవరో ఇప్పడే చెప్పూ
కాయ చూడు పండు చూడు దాలోని రుచి చూడు
చేసిన దేవుడు ఎవరో చెప్పూ
సృష్టిలోని ఉన్నవన్ని ఎవ్వరూ చేయలేరుగా
చెయ్యాలి ఆ దేవుడే గాడ్‌ లవ్స్‌యు గాడ్‌ వాంట్స్‌యు “నీ కోసం”
2 చెయ్యి చూడు గీత చూడు వేలిముద్రే ఉంది చూడు
ఎవరి వేలిముద్రే అది వేరు
పిడికెడంత గుండె చూడు అది చేసే పని చూడు
చేస్తుందెందుకు అది నువ్వు చెప్పూ
కన్ను లెన్ని ఉన్న కన్ను కూడా చేయాలేవుగా
కన్నులెన్ని ఉన్న అన్ని కన్నులు ఒకటి కాదుగా
చేసాడు ఆ దేవుడే
దేవుడు ప్రేమిస్తున్నాడు నువు కావాలని అంటున్నాను “నీ కోసం”