ప్రేమించలేదని
265
పల్లవి: ప్రేమించలేదని మరణించుటే న్యాయమా?ప్రేమించలేదని ప్రాణం తీసావుగా!
“ప్రేమ ఆన్నది దేవునిలోనే వున్నది” (2)
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే, ఇలాంటి ప్రేమే లేదే ఏప్రేయసిలోనే “ప్రేమించలేని”
1 ప్రేయసి కంటే ప్రియునికంటే దేవుడే ముందు వున్నాడుగా!
ప్రేమంటే ఏంటో ఎలా వుంటుందో
దేవుడె ముందు చూపాడుగా (2)
ఆదాము కొరకు హవ్వను చేసి
దేవుడే ఇచ్చాడు, అందరి కొరకు
అన్నీ చేసి ముందే ఇచ్చాడు,
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే
ఇలాంటి ప్రేమే లేదే నీ ప్రియునిలోనే (2) “ప్రేమించలేదని”
2 శత్రువ్‌వైనా, మిత్రుడివైనా ప్రేమించాడు దేవుడేగా
దేవుణు ప్రేమ నీకుంటే నీ ప్రేయసి ప్రాణం తియ్యవుగా (2)
ప్రేమించి దేవుడు అన్నీ ఇస్తే ప్రేమించకున్నావు అసలేమి
ఇవ్వని ప్రేయసి కోసం పడి సచ్చిపోతావు, ప్రేమే నువ్వంటే
ప్రేమే దేవుని ప్రేమే, ఇలాంటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే “ప్రేమించలేదని”