నింగి, నేల
263
పల్లవి: నింగి, నేల నీరు నిప్ప గాలీ
ఇవి చేసిందెవరో తెలుసునా? నీకిచ్చిందెవరో తెలుసునా?
నీ ఆకలితీర్చే ఆహారాన్ని చేసింది ఎవరు?(2)
నువు పుట్టకముందే చేసాడు అన్ని ఇచ్చాడు నీకనీ
నీవెవరివో తెలుసా? ఓ మనిషి నీ వెవరివో తెలుసా? “నింగి నేల”
1 కన్ను, ముక్కు కాళ్ళు చేతులు నీకెవరిచ్చారు?
నువు పుట్టకముందే తల్లి రొమ్ములో పాలెవరు పెట్టారు? (2)
“నీ ఆకలితీర్చే ఆ దేవుడెవెని,
ఎప్పుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా?” (2)
పీల్చేగాలి, త్రాగేనీరు ఎరుచ్చారు? (2) “నింగి నేల”
2 పండు కాయకు రుచిని పెట్టి నీకెవరిచ్చారు?
నువు పుట్టకముందే చెట్టు చెట్టుకి కాయెవరు పెట్టారు? (2)
నీ కోరిక తీర్చే అతనెవరో దాకని నీ తల్లిదండ్రులకే తండ్రిని నువుమరిచావా? (2)
పీల్చేగాలి, త్రాగే నీరు అతనిచ్చాడు “నింగి నేల”