లెక్కించలేని స్తోత్రముల్
257
పల్లవి: లెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పడు నేపాడెదాన్
ఇంత వరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై “లెక్కి”
1 ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకారము
భూమిలో కనబడునవన్నీ - ప్రభూవా నిన్నే కీర్తించున్ “లెక్కి”
2 అడవిలో నివచించునవన్నీ - సుడిగాలియు మంచును
భూమిపై నున్నవన్నీ - దేవా నిన్నే పొగుడును “లెక్కి”
3 నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాశులు
ఆకాశమున ఎగురునవన్నీ- ప్రభువా నిన్నే కీర్తించున్ “లెక్కి”