నా జీవిత భాగస్వామివి నీవు
240
పల్లవి: నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు \rq (2)\rq
నాకే సమృధిగా నీ కృపను పంచావు నా యేసురాజా
కృప సాగరా అనంత స్తోత్రర్హుడా \rq (2)\rq
1 నీ దయగల కనుసైగలే- ధైర్యపరచినవి
నీ అడుగు జాడలే- నాకు త్రోవలు చూపినవి \rq (2)\rq
నీ రాజ్య పౌరునుగా- నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి \rq (2)\rq
2 నీ దయగల మాటలే- నన్ను చేర దీసినావి
నీతి నియమలలో నన్ను నడిపింపించుచున్నది \rq (2)\rq
నీ కృపనే ధ్వజముగా నాపైన నిలిపితివి
నీ విందు శాలలో నన్ను చేర్చితివి \rq (2)\rq
3 నీ దయ గల తలంపులే- రూపు నిచ్చినవి
నీదు హస్తములే- నన్ను నిర్మించినవి \rq (2)\rq
నీ చిత్తమే నాలో నెరవేరుస్తున్నావు
నీ అంతపురములో నన్ను చేర్చుదువు \rq (2)\rq