పనికి రాని పాత్రను నేను యేసయ్యా
236
పల్లవి: పనికి రాని పాత్రను నేను యేసయ్యాపగిలి పార వేయబడితి నేను యసయ్యా \rq (2)\rq
కుమ్మరి నీవని విన్న నా చెంతకు రమ్మని అన్న \rq (2)\rq
నీ కిష్టమైన పాత్రగా చేసి నీ సేవకై వాడుమా \rq (2)\rq
1బ్రతుకు బాటలో నేను వికిగి వేసారితి
గుండె పగిల్లి నేను బహు కలత చెందితి \rq (2)\rq
నాహృదయంలో ప్రవహించే కన్నీటి ధారాలే
నీ కోసం నా ప్రాణం పరితపించేనే \rq (2)\rq
నువ్వు వస్తావని నమ్మిక యుంచి హృదిని తెరిచ్చి ఉంచా \rq (2)\rq “కుమ్మరి”
2 ఏ ప్రేమ దొరకని నా నరక బాధలో
అందరు విడిచ్చి వెల్లిన నా ఒంటరి బ్రతుకులో \rq (2)\rq
నీ ప్రేమే చేలయేరై నా హృదిని తాకెనే
అవి ప్రవహించి నన్ను పరిశుద్ధుని చేసెనే \rq (2)\rq
మర్గం సత్యం జీవం తానై రూపానిచ్చె దేవా \rq (2)\rq
కుమ్మరి నీవై వచ్చావు నా చెంతకు నీవే చేరావు
పనికి రాని నన్ను నీ పాత్రగా చేసితివయ్యా
కోట్ల కొలది స్తోత్రమలు నీకే యేసయ్యా
నా జీవితాన్ని మార్చిన దేవుడు నీవయ్యా \rq (2)\rq