స్తుతి పాత్రుడా స్తోత్రర్హుడా
235
పల్లవి: స్తుతి పాత్రుడా స్తోత్రర్హుడాస్తుతులందుకో పూజర్హుడా
ఆకాశమందు నీవు తప్ప
నా కెవ్వరున్నారు నా ప్రభు (2)“స్తుతి”
1 నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి
దూరన నిలిచేను నా ప్రభు (2)
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై (2)
నన్ను నిలిపెను నీ సన్నీధిలో
సంఘములో “స్తుతి”
2 నా శత్రువులు నన్ను తరుము చుండగా
నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనుస్సు నీ వైపు త్రిపిన వెంటనే (2)
శత్రువుల చేతి నుండి విడించినావు “స్తుతి”