మాయ లోకము మనది కాని లోకము
231
పల్లవి: మాయ లోకము మనది కాని లోకము
మనుసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము
భూమిపైన మనమంత యాత్రికులం
ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం (2)
1 ఎండ మావిలాంటి ఈ అందమైన బ్రతుకులో
కనిపించేవన్ని వట్టి బ్రమలే కాదా
ఊపిరాగి పోతే ఏముందలే (2)
ప్రభుని నమ్ముకుంటే జీవముందిలే
నిత్య జీవముందిలే…“ మాయ”
2 కనిపించే మనుష్యులంత తెర మీద బొమ్మలే
కనిపించిన వారు కూడ కాలకాలం ఉండరులే
నీకు ఈ లోకములో ఏముందిలే (2)
తెలుసు కుంటె నీకు మరో లోకముందిలే
పరలోకముందిలే…“ మాయ”