చాలునయ్యా
230
పల్లవి: చాలునయ్యా -చాలునయ్యా
నీ కృపా నాను చాలునయ్యా (2)
ప్రేమ మయుడవై ప్రేమించావు
కరుణా మయుడవై కరుణించావు
ప్రేమ కరుణా నీ కృప చాలు(2)
1 జిగట గల ఊబిలో పడియుండగా
నా అడుగులు స్థిరపర్చి నిలిపితివయ్యా (2)
ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్య
హిమము కంటెను తెల్లగ మార్చయ్య
నీకేమి చేల్లింతు నా మంచి యేసయ్యా
నా జీవితమంతా అర్పింతు యేసయ్యా (2)“ ప్రేమ కరుణా ”
2 బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లితండ్రులే నన్ను వెలి వేసిన (2)
నన్నూ నీవు విడువలేదయ్యా
మిన్నగా ప్రేమించి రక్షించినయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్య
నా జీవిత మాంత అర్పింతును యేసయ్య వ (2) “చాలునయ్యా”