గమ్యం చేరాలని- నీతో ఉండాలని
224
పల్లవి: గమ్యం చేరాలని- నీతో ఉండాలనిపగలు రేయి పరవ సించాలని
ఈ నింగి నేల- కనుమరుగైన శాశ్వత జీవం పొంతలని
సాగిపోతునాను- నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను-నిన్ను చేరాలని (2)
1 భువియంత తిరిగి-జగమంత నడిచి
నీ జ్ఙానమునకు స్పందించాలని
నాకున్నవన్నియు- సమస్తం హెచ్చించి
నీ ప్రేమయెంతో కొలవాలని
అదియెంత ఎత్తున ఉందో- అదిఎంత లోతున ఉందో
అది యే రూపంలో ఉందో- అదిఎంత లోతున ఉందో
2 అలలెన్నో రేగిన- శ్రమలెన్నో వచ్చిన
శిరమును వంచి సహించాలని
వేధన బాధలు- గుండెను పిండిన
నీదు సిలువనె మోయాలని
నా గుండె కోవెలలోన- నిన్ను నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని