దుర్దినములు రాకముందే
223
పల్లవి: దుర్దినములు రాకముందే- సర్వం కోల్పొక ముందేఅంధత్వం కమ్మక ముందే- ఉగ్రత దిగి రాక ముందే
స్మరించు రక్షకుని- అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక
1 సాగిపోయిన నీడ వంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది
తెరిచివుంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం (2)
పాతాళ వేదనాలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింప జాలవు (2)
2 రత్నరాసులేవి నీతో కూడారావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి
యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2)
తొలిగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాని
విశ్వసించు యేసుని విడిచి పెట్టు పాపాన్ని (2)