నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను
219
పల్లవి: నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేనునా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను(2)
నిన్ను విడిచి నేనుండలేను-ఒక క్షణమైన కూడ నే బ్రత్కగలనా?
నువ్వు లేక పోతే ఒక క్షణమైన కూడ (2)
బ్రత్కలేను నా స్నేహితుడా- బ్రత్కలేను నా యేసయ్యా (2)
1 అమ్మ లేక పోయినా- నాన్న లేక పోయినా
ఎవరు లేక పోయినా -నే బ్రత్క గలను (2) “నువ్వు లేక”
2 గాలి లేక పోయినా- నీరు లేక పోయినా
ఏమి లేక పోయినా నే బ్రత్క గలను (2) “నువ్వు లేక”
3 నా శ్వాస నేను కోల్పోయినా- సమయమున
నీ శ్వాస నాచ్చి బ్రతికించావు (2)
మనస్సు మలినమైన నన్ను మరల బ్రతికించి- నీ శ్వాస నాకిచ్చావు (2)