స్నేహితుడా-నా స్నేహితుడా
215
పల్లవి: స్నేహితుడా-నా స్నేహితుడానా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా “స్నేహితుడా”
1 నన్నెంతో ప్రేమించినావు- నా కోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము- మరచి ఇలనే మనగలనా (2)
2 నా ప్రాణ ప్రియుడా- నీ కోసమే నేవేచాను నిరతం నీ తోడుకై
మరువగలనా నీ స్నేహము- మరచి ఇలనే మనగలనా (2)
3 కన్నీటితో ఉన్న నన్ను- కరుణించి నన్ను పలికరించావు (2)
మరువగలనా నీ స్నేహము- మరచి ఇలనే మనగలనా (2)