మార్గములను సృజియించువాడు
207
పల్లవి: మార్గములను - సృజియించువాడు
జీవితాలను వెలుగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు - యెహోవాయే నాకుండగా
నేను సాధించలేనిది లేనే లేదు - జయించలేనిది లేనేలేదు
అసాధ్యమైనది లేనే లేదు - విజయమెపుడు నాదే! “మార్గము”
1 ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను - జలములు నా పైకి లేచినను (2)
సంకెళ్ళు నన్ను బిగదీసినను - శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ నేను
2 జీవితమంత శూన్యమైనను - బంధువులంత నన్ను విడిచినను (2)
వ్యాధులెన్నో నన్ను చుట్టినను - అడ్డంకులెన్నో నాపై ఎదురైననూ నేను “మార్గము”