నీవులేని రోజు అసలు
193
పల్లవి: నీవులేని రోజు అసలు రోజే కాదయ్యానీవులేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా
నీవే లేకపొతే నేనస్సలే లేనయ్యా (2) “నీవులేని”
1 బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నిరు తుడచి నా చెయ్యి పట్టావు(2)
నన్ను విడవనన్నావు నా దేవుడైనావు (2)
నీవే లేకపోతే నేనస్సలే లేనయ్యా (2) “నీవులేని”
2 ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగి ఉన్నవన్ని నీదుకృప భాగ్యమే (2)
నీవు నా సోత్తున్నావు కృప క్షేమమిచ్చావు (2)
నీవే లేకపోతే నేనస్సలే లేనయ్యా (2) “నీవులేని”