నా నీతికి ఆదారం ప్రభు నీవేకదా!
189
పల్లవి: నా నీతికి ఆదారం ప్రభు నీవేకదా! నీవేకదా!
నా రక్షణకాదరం ప్రభు నీవేకదా! నీవేకదా!
నిన్ను నమ్మినవాడను నను అంగికరించుము (2) “నా నీతికి”
1 నా శ్రమలో మొరపెట్టగా - కన్నీరు తుడిచవయ్యా
నిన్నుగాక మరి దేనిని - నేకోర లేదుయ్యా (2) “నా నీతికి”
2 నువ్వు తూచే ఆ త్రాసులో- సరితూగ లేనయ్యా
నీ ప్రేమ వర్ణించుట - నా తరము కాదయ్యా (2) “నా నీతికి”
3 నా కొరకు ఆ సిలువపై - మరణించినవయ్యా
కడవరకు నీ ప్రేమను - నే చాటెదన్‌ ప్రభువ (2) “నా నీతికి”