అందరు నన్ను విడిచినా
188
పల్లవి: అందరు నన్ను విడిచినా -నీవు నన్ను విడువనంటివే(2)
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లిదండ్రి నీవే యేసయ్యా (2)
1 లోకము నన్ను విడిచినా - నీవు నన్ను విడివనంటివే (2)
నా బందువు నీవే నా మిత్రువు నీవే
నా బందుమిత్రు నీవే యేసయ్యా (2)
2 వ్యాధులు నన్ను చుట్టిన- బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే - నా కొటయు నీవే
నా కొండ కోట నీవే - యేసయ్యా (2)
3 నన్ను నీవు నమ్ముకుంటివే- నీవు భయపడకంటివే (2)
నా తోడు నీవే - నా నీడ నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2)