ఆశిర్వదించుము దేవా
185
పల్లవి: ఆశిర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా
అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు(2) “ఆశిర్వదించు”
1 అపత్కలములో సహాయకుడవు నీవే
అందరిని ప్రేమించే యేసు నాధుడు (2)
ఆశ్రయ దుర్గము నీవే ఆనంద తైలము నీవే (2)
ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే (2) “ఆశిర్వదించు”
2 నీ యందు భయభక్తులు గలవరి యెడల
దయచూపు చున్నావు తరతరముల వరకు (2)
నీ యందు భయభక్తులు కల్వరి ఈ పిల్లలు (2)
నీరు కట్టు తోటలో బహుగా పలియించేను (2) “ఆశిర్వదించు”
3 తోట్రిల్ల నియ్యవు మా పాదములను
తోడై నిడై త్రోవకు వెలుగై(2)
కాపాడు చున్నావు కనుపాపవలె మమ్మును (2)
కడవరకు విడవకను నడిపించేదవు (2) “ఆశిర్వదించు”