అపరాధిని యేసయ్యా
183
పల్లవి: అపరాధిని యేసయ్యా - కృపజూపి బ్రొవుమయ్యా
నెపమెంచకైయే నీ కృపలో నపరాధములను క్షమించు (2) “అపరాధిని”
1 సిలువకు నిను నేగొట్టితిని - తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని (2)
దోషుండ నేను ప్రభువా “అపరాధిని”
2 ప్రక్కలో బల్లెపోటు - గ్రక్కున బొడిసితి నేనే (2)
మిక్కిలి భాదించితిని (2) మక్కువ జూపితివయ్యా “అపరాధిని”
3 ముళ్ళతో కీరిటంబు - నల్గిన శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె (2) చల్లని దయగల తండ్రి “అపరాధిని”
4 దాహాంబు గొనగా చేదు - చిరకను దృవవిడితి (2)
ద్రొహుండనై జేసితిని (2) దేహాంబు గాయంబులను “అపరాధిని”
5 ఘెరాంబుగా దూరితిని - నేరంబులను జేసితిని (2)
క్రూరుండనై గొట్టితిని (2) ఘెరంపు పాపిని దేవా “అపరాధిని”
6 చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బల చేత (2)
నిందలు పెట్టితినయ్యా(2) సందేహా మేలనయ్యా “అపరాధిని”
7 రక్షణ దేచ్చితివయ్యా - శిక్షకు పాత్రుడనయ్యా (2)
అక్షయ భాగ్యమునియ్యా (2) మోక్షంబు జూపితివయ్యా “అపరాధిని”
8 పర్వతములు తొలగిపొయినను - తన కృప నిను ఎన్నాడు వీడదు (2)
కనికర సంపన్నుడా - నా దేవుడు (2) “అపరాధిని”