మంచి లేని నాపైనా ఎంతో ప్రేమ
182
పల్లవి: మంచి లేని నాపైనా- ఎంతో ప్రేమ చూపావు (2)
ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తవు
పరలోకమును విడచి దిగివచ్చినావు భువికి (2)
ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా (2) “మంచిలేని”
1 లోకాలన్ని ఎలే రారాజువైనా నీవు
సామాన్యుని ఇంట ఇలా కాలు పెట్టినావు (2)
నీ కేంత దీన మనుసు నాకు ఎంత ఘనత యేసు “ఎంతగా ”
2 నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంత కొచ్చినావు (2)
నీ లోన జాలిపోంగే నాలోన శాంతి నిండే “ఎంతగా ”
3 చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసినావు
వేకువ వెలుగు వంటి దర్శనం ఇచ్చినావు (2)
నీ సాటిలేని త్యాగం నా పాలిగొప్ప భాగ్యం “ఎంతగా ” “మంచిలేని”