నీవుంటే నాకు చాలు యేసయ్యా
181
పల్లవి: నీవుంటే నాకు చాలు యేసయ్యానీ వెంటే నేను వుంట యేసయ్యా (2)
నీ మాట చాలయ్యా - నీ చూపుచాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా (2) “నీ మాట చాలయ్యా”
1 ఎన్ని బాధలు ఉన్నాను - ఇబ్బందులైననూ
ఎంత కష్టం వచ్చినా - నిష్టురామైననూ (2) “నీ మాట చాలయ్యా”
2 బ్రతుకు నావ పగిలిన కడలిపాలైనూ
అలలు ముంచివేసిన ఆశలు అనగారిన (2)
3 ఆస్తులన్ని పోయినా - అనాదిగా మిగిలిన
ఆప్తులే విడనాడిన - ఆరోగ్యం క్షిణించిన (2) “నీ మాట చాలయ్యా”
4 నీకు ఇలలో ఏదియు లేదు అసాద్యము
నీదు కృపతో నాకేదియు కాదిల సమానము (2) “నీ మాట చాలయ్యా”