దేవుడెన్ని చేసినా మనిషికెంత ఇచ్చినా
176
పల్లవి: దేవుడెన్ని చేసినా మనిషికెంత ఇచ్చినా
నమ్మలేదు మనుష్యులు ఒక దేవునినే
సృష్టినంత చూసినా చేసింది అతనే అన్నా
నమ్మకమే లేదు తన పిల్లలకే
అతనొకడే నీ తండ్రి - అతనొకడే నీ దేవుడు (2)
మీరంతా పిల్లలని మీకు తెలియదా? (2)
ఆ దేవునినే ఏడిపిస్తున్నారు నమ్మక
సాతాను మాయలో ఉన్నారని అది తెలియక “దేవుడెన్ని”
1 సృష్టినంత చేసి ఆకలంత తీర్చి
మొదటి మనిషికే ఇచ్చింది ఎవరు
ఆదాము హవ్వలకు దేవుడొక్కడే ఉంటే
మీ కందరికీ ఆ దేవుడు ఎవరూ (2)
ఒక్కదేవుడే అందరిని చేసాడు గదా
ఆదాము నుండే మీరందరూ వచ్చారు గదా?
అందరికి ఒక దేవుడని మీకు తెలియదా
ఒక కుటుంబానికే తండ్రొకడని అది తెలియదా
పతియే ప్రత్యక్ష దైవమా భార్యలంతా దేవతలా (2)
నమ్మలేని ఈ మనుష్యులకు స్వర్గం ఇచ్చేదెలా? “దేవుడెన్ని”
2 తల్లిదండ్రులే నమ్మిన దేవుని నువ్వు నమ్ముకున్నావా?
ఆదామే నమ్మిన దేవుని నమ్మావా (2)
ఆదాము హవ్వలకు దేవుడు తండ్రే అయితే
ఆ దేవుడు దేవుడని నమ్మలేవా
ఒక్కదేవుడే అందరిని చేసాడుగదా
ఆదాము నుండే మీరందరూ వచ్చారు గదా? (2)
అందరికి ఒక దేవుడని మీకు తెలియదా
ఒక కుటుంబానికే తండ్రొకడని అది తెలియదా
పతియే ప్రత్యక్ష దైవమా భార్యలంతా దేవతలా (2)
నీ కన్న తండ్రినే లేడంటే నిను నమ్మించడమేఎలా? “దేవుడెన్ని”