స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే
175
పల్లవి: స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే,
సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే (2)
క్షమియిస్తాడు, రక్షిస్తాడు నువ్వు నమ్మితే (2)
నమ్మాలి ప్రతి మనిషి భువిపైనే
మరణిస్తే క్షమేలేదులే “స్వర్గాన్ని”
1 పగలైనా, రేయైనా, నీ కోసం ఇచ్చాడు దేవుడేగా,
దినమంతా నీ కోసం ఈ భూమి త్రిప్పాడు దేవుడేగా
నమ్మాలి దేవున్నే నేడు తెలుసుండాలి నీకు ఏనాడు
బ్రతికుండగా వదులుకోకు ఆదేవున్నే నువ్వు మరిచిపోకు
నమ్మాలి నిజమైన దేవున్ని బ్రతుకిచ్చిందతనని తెలుసునా? “స్వర్గాన్ని”
2 తండ్రైనా, యేసైనా, ఆత్మైనా, నీ కోసం ఉన్నారుగా,
దినమంతా నీ కోసం ఎదురుచూస్తూ వేచియున్నారుగా
ఆ యేసు నిను వదలలేదు నీ కోసం భువిపైకి వచ్చాడుగా,
తన తమ్ముడే వదలలేదు నీ కోసం నీలోనే వున్నాడు
మారాలనే మనసు నీకుంటే స్వర్గం సొంతమవుతుందిగా “స్వర్గాన్ని”