దేవున్ని నువ్వు నమ్ముకుంటే
174
పల్లవి: దేవున్ని నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా?ఆనాడు ఆ అబ్రహామే ఆ దేవుని తెలిపాడుగా
బలిపీఠాలు కట్టాడుగా..దేవున్ని ప్రకటిస్తూ వచ్చాడుగా..
ఇస్సాకాలాగే చేసాడుగా, యాకోబు మందిరమే కట్టాడుగా
వీరి భక్తి దేవుడు చూసి, వారి దేవుణ్ణిని అన్నాడుగా “దేవున్ని నువ్వు”
1 సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా
నీ నయనాలు చెవులు, నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా (2)
తల్లిని, తండ్రిని, అన్నా చెల్లిని భార్యను
నీవు అందరిని నమ్మావుగా
అన్నిటి నిచ్చిన దేవుని నమ్మాలని
అంటే సాక్ష్యాలు అడిగావుగా
సృష్టినంతా, తాకి చూసి, రుచి చూసైనా నమ్మాలిగా “దేవున్ని నువ్వు”
2 నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా
సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా (2)
తల్లిని, తండ్రిని, అన్నా చెల్లిని అందరి గూర్చి ఎన్నెన్నో చెప్పావుగా
అడగాని వారిని పిలిచి అన్నిటి గూర్చి చెప్పి దేవున్నే మరిచావుగా
నీ భక్తి, దేవుడు చూసి నీ దేవున్నని చెప్పాలిగా “దేవున్ని నువ్వు”