ఏమియ్యా గలనయ్యా నా యేసయ్యా
172
పల్లవి: ఏమియ్యా గలనయ్యా నా యేసయ్యా..నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా..
ఊపిరి ఉన్నంత వరకు పాడన (2)
1 గురిలేని నా జీవిత పయనంలో
దరిచేరి నిలిచిన నా దేవుడవు
మతిలేక తిరుగుతున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నా పైన ఈ ప్రేమ వర్ణింపలేను నా యేసయ్యా (2) “ఏమియ్యా ”
2 ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నాను
నీవులేని జీవితం వ్యర్ధమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏ మిచ్చి నీ రుణం తిర్చెదనయ్యా
నీ సాక్షిగా నన్ను మలచినందుకు (2) “ఏమియ్యా ”